16 August 2011

లవ్ కోటి


వీక్షకులకు దన్యవాధములు


నా లవ్ సఫలం కావాలని లవ్ కోటి రాయాలని నా లవ్ పేరును 500 సార్లు టైపు చేసాను అందుకు నాకు సుమారు 20నిమిషములు సమయం పట్టింది. అంటే కోటి సార్లు టైపు చేయలంటే 400000 నిముషములు పట్టును అంటే సుమారు 277 రోజులు వచ్చింది.
అందువల్ల copy & paste options  ఉపయోగించి కోటి సార్లు రామ అని టైపు చేసాను. మీకు కావాలంటే ఈక్రింది లింకు ద్వారా download చేసుకోండి. కాని అందులో ఉన్న కీ ని కనిపెట్టగలిగితేనే మీకు ramakoti open
అవుతుంది

click here

03 August 2011

తెలుగు పై క్రొత్త ప్రాస

దేశ భాష లందు తెలుగు లెస్స (శ్రీ కృష్ణదేవరాయలు)



ఆంధ్రప్రదేష్ నందు తెలుగు లెస్సు (నా మాట)

NTR mayasabha dialog remix

నేనేల sms పంపవలే! పంపితినిపో!
తనేల చూడవలే! చూసినదిపో!
చూసేల చదవ
లే! చదివిందిపో!
ఏల నవ్వవలే! నవ్విందిపో!
నేనేల ఊహించవలే! ఊహించితినిపో!
.
.
.
.
.
.
ఇక నావల్ల కాదు శుభోదయం
Good Morning

Nothing

Give an example for
"అత్త సొమ్ము అల్లుడి దానం"
.
.
.
.
.
.
.
sms లు నావి ఆనందం నీది

Papam God

BANGARAM 2 GOD

God : భక్తా నీ భక్తికి మెచ్చితిని ఏమి కావాలో కోరుకో నాయనా!

I : మాట మార్చరు కదా స్వామి!

God : ఎంత మాట! ఎంత మాట! కోరుకో నాయన.
I : ని brain నాకు, నా brain నీకు exchange చేసుకుందాం స్వామి.
.
.
.
.
.
.
.
.
.
. now you guess, what is the god position?


good ni(7+1).

bomb


అమెరికా అణుబాంబులు వేసినా జపాన్ దోస్తి చేస్తుంది


కాని






నేను ఒకేఒక బాంబు(love) వేస్తె నువ్వు దోస్తి మానేసావు. ఎందుకు?

Good Mor(e)ning


నిద్రలో నిర్మించిన కలల సౌధాలకు ఈ పగలంతా ఇస్తుంది నీకొక అవకాశం ........! So మేలుకో మిత్రమా మేలుకో.


good mor(more)ning

Shivarathri

శివుడి order లేనిదే చీమైన కుట్టదు (old)

అలాంటిది ఏ శివుని order కావాలో నీ cell switch on కోసం. happy శివరాత్రి.

I gave a chance to her

hi......! నీకో chance

నేను అడిగింది తెచ్చిస్తే నిన్ను మరచిపోతాను.....! ok నా










నీ కంటే అందమైన మంచి అమ్మాయిని చూపించు నిన్ను మరచిపోతాను....... ( it is impossible to you )

fav' GOD of her

నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకునే దారేది అని హనుమాన్(ఇష్టమైన దైవం) ని అడగాలా.......!

అడిగేవాడినే కాని గాలి god (మారుతి) కనబడటంలేదు, కనబడడు ఉంటాడు అంతే అని ఒక శాస్త్రవేత్త చెప్తే ఊరుకున్నా.....!
ఏమిచేయమందు...వే
ఏమి..చే..యమందు..వే ( what can I do )

who is the real lover?

Do anything for her ---------------> ( Person -A)
Do anything for her only--------------------> (Person -B).




తన కోసం ఎదైనా చేస్తాను.--------------->(Person -A)
తన కోసమే ఎదైనా చేస్తాను.----------------> (Person -B)

if
You like person A's opinion press ------- Like
You like person B's opinion press ------- Interesting
You doesn't accept any one press ------- Unlike

నా ప్రేయసి నవ్వు

కోట్ల ఆస్తులు ఉన్న అంబాని కోటీశ్వరుడు కావచ్చు
.
.
కాని
నీ నవ్వు చూసిన నా ముందు చాలా పేదవాడు.

7000 ఆలోచనలు

ఒక మనిషికి రోజుకు 7000 ఆలోచనలు వస్తాయని అంచనా వేసారు
.
.
.
.
కాని

నాకేంటి రోజూ ఒకే ఆలోచన 7000 సార్లు వస్తున్నాయి అది నా love గురించే.

విగ్రహం

ఎందరో మహానుభావులు అందరికి వందనములు
మహానుభావులు అందరు తమ జీవితకాలంలో తమ లక్ష్య సాధన కొరకు ఎంతో కష్టపడి, బాదపడి, శ్రమటోడ్చి, అహర్నిషలు తమ తమ లక్ష్యంను సాధించుకోవడం లో సఫలీకృతులైనారు. వారి ఉధ్దేశ్యం లో వారి వారసులకు తమ లక్ష్యం వల్ల మేలు జరుగుతుంది అని నమ్మేవారు. అలా వారి జీవితం మనకు ఆదర్శం అయ్యాయి.
అలాంటి వారిని మనం గౌరవసూచకంగా వారి ఆత్మకథలను, ఆశయాలను, లక్ష్యాలను పుస్తకరూపంలో ముద్రించి చదువుకోవడమే కాక విగ్రహలను ప్రతిష్టించుకున్నాము.
కాని నాకు ఒక సందేహము.
వారు జీవించి ఉన్నపుడు కష్టపడ్డారు అలాగే చనిపోయిన తరువాత కూడ విగ్రహాలు గా ఎండలో ఎండి, వానలో తడిచి, చలికి గడ్డకట్టి ఎవరైనా నచ్చక రాల్లతో కొట్టినా పడుకుంటూ అలా ఉండిపోతున్నారు. మమ్మల్ని ఆదర్శముగా తీసుకోండి అని చనిపోయినా తరువాత కూడ విగ్రహాల రూపంలో మనకు ఆదర్శము గా నిలుస్తున్నారు అది ఎంతమంది గ్రహిస్తున్నారు...........

నేను కూడ ఒక విగ్రహం తయారు చేసుకుని నా పై ఒక గమనిక " నా లా ఉండకు" అని రాయించుకుంటా..........ఎందుకంటే నేను ఇప్పటి వరకు సాధించింది ఏమిలేదు.......

నంబరు ప్లేట్

మన పొరుగు రాష్ర్టాలలో వాహనాల నంబరు ప్లేట్ వారి మాతృభాష లో ఉంటే, మన ఆంధ్రప్రదేష్ లో మాత్రము ఆంగ్ల అక్షరమాల ను ఉపయోగిస్తాము. అసలు తెలుగు అంకెలు ఇప్పుడు ఎంతమంది పిల్లలకు తెలుసు.


ఉదాహరణకు :




పర్యాటక ప్రదేశాలలో, లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు అధికంగా ఉండే ప్రదేశాలలో office sign board or shop sign board లు English లొ వ్రాయడం జరిగింది అంటే అది ప్రజల సౌకర్యార్ధం అనుకోవచ్చు. కాని మన పల్లెటూర్లలో కూడ English లోనె వ్రాస్తున్నాము కదా! ఒక సారి ఆలోచించండి.

వినాయక చవితి

చవితి పండగ సందర్భంగా మనం అందరం ప్రతీ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తి తో పూజలు నిర్వహించి ఆ తరువాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము.
ఈ పండుగకు ముందు 2 నెలల నుండి రైతులు చెరువులలో కుంటలలో పూడికతీత పనులు నిర్వహిస్తారు. తద్వార తరువాత పడే వర్షపు నీటిని వృధా కాకుండా నివారిస్తారు. అయితే ఈ సమయంలో వర్షపు నీటితో కలకలాడుతూ ఉన్నపుడు పూడిక నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని ప్రజలు పూడికతీతలో చూపిన శ్రధ్ద పూడిక పూడ్చడంలో చూపడంలో లేదు. అందుకే ప్రతీ ఇంటి నుండి కొంత మన్ను లేదా మట్టిని విగ్రహరూపంలో తయారు చేసుకుని ఆ మట్టిముద్దను చెరువులో నిమజ్జనం చేయాలని ఆచారం చేసారు. ఆ ఆచారం వల్ల పూడిక తీసిన చెరువులు పూడిక నిండుతుంది.
కాని నేడు ఆ వినాయక విగ్రహాలు మట్టితో కాకుండా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో రంగురంగుల కెమికల్స్ ఉపయోగించి తయారుచేస్తున్నారు. వాటి వల్ల చెరువులు పూడిక నిండకపోగా నీటి కలుషితం జరుగుతుంది. దయచేసి గమనించండి.............
..........నిర్ణయం మీదే పర్యావరణ పరిరక్షణ మీదే.......

ప్రేమ

వయోజన వయస్సులో ప్రేమ సాదారణం.
అసలు ఈ ప్రేమలో పడ్డవారు ఎవరికి చెప్పకుండా ప్రేమికుడితో ప్రేయసి, ప్రేయసితో ప్రేమికుడు పార్క్ లకు వెల్లడం. రాత్రి ఇంటికి లేట్ గా వెల్లడం మాత్రమే ప్రేమ అనుకుంటున్నారు. ఈ మద్య sms లు వచ్చాయి. కాల్ రేట్లు తగ్గి గంటలు గంటలు మాట్లాడటం మాత్రమే ప్రేమ అనుకుంటున్నారు.
ఇక చివరికి చదువు కాలపరిమితి అయిపోగానే మా ఇంట్లో పెల్లి సంబంధాలు చూస్తున్నారు అని ఎవరికి వారు విడిపోతున్నారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు బైకు మీద గాని, పార్క్ లోగాని తిరుగుతున్నపుడు మీకు తెలిసినవారి కండ్లలో పడ్డారనుకో మీ పరిస్ధితి ఏంటి, మీ పై ఎంత చెడుగా మాట్లాడుకుంటారో కూడ ఆలోచించండి.
ఒక సారి తల్లిదండ్రులకు నేను ఇతనిని ప్రేమిస్తున్నాను. ఇతని ఇచటి వాడు, తల్లిదండ్రుల విషయాలు, అతని స్ధితిగతులు వివరించి, ఇక మీ ఇష్టం అని కరాకండి గా చెప్పేయండి. తరువాత మీ తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డు చెప్పకండి. ఆ నిర్ణయం మీకు వ్యతిరేఖం అయితే, వెంటనే మీ ప్రియుడి కి మీ పరిస్ధితి ని వివరించండి. ఇక భవిష్యత్ గురించి ఆశావాహ దృక్పధంతో ఉండండి. అంతే, కాని మీ పెద్దలకు చెప్పడం మీ బాద్యత అది మరవకండి.
100 శాతం ప్రయత్నించండి. ఆ పై వారి నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఇది అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడ.

విద్య

విద్య గురించి చర్చించుకునేటప్పుడు మన పాత నానుడి ని ఒకసారి గుర్తుచేసుకుందాం
కోటి విద్యలు కూటి కొరకే
కాని ఇది నేడు మార్చుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం
కోటి విద్యలు ఙానం కొరకే
ఇలా ఎందుకు అంటున్నాను అంటే ఒకప్పుడు మనకు కుల వృత్తులనే విద్యలు గా భావించేవారు. ఆ తరువాత అక్క్షరఙానం ను విద్యగా భావించారు. కాని ఇప్పుడు చదువు, పై చదువు, ఉన్నత చదువు అని పలురకాల చదువులు అందుబాటులోకి వచ్చాయి. అందరు మనం చదివిన చదుఫుకు తగిన న్యాయం చేద్దాం అనే ఉధ్ద్యేశ్యంతో చదువుతున్నామా? అని ఒకసారైనా ప్రశ్నించుకోవాలి.
ఇక కూటి గురించి ఆలోచిస్తే అడుక్కొని కూడ కడుపు నింపుకోవచ్చు, ఆ అడుక్కోవడం కూడ ఒక విద్యనే అందులో కూడ తెలివి ప్రదర్శించాలి. ఇక్కడ అడుక్కొని సంపాదించిన తిండి మామూలు బియ్యం అయితే చదువుకొని ఒక పని చేస్తూ సంపాదించి తినే తిండి మద్య రకం బియ్యం కావచ్చు, ఇంకా బాగా చదివిన వారు బి.పి.టి బియ్యం, ఆ పై ఇంకా మంచి తిండి తింటాడు. ఆంతే కదా!
ఇప్పుడు ఒక సంఘటన చెప్తా, కొందరు స్నేహితులు అందరు కలిసి ఒక వాహనం ను మాట్లాడుకుని ఒక టూర్ కు వెలుతున్నారు. మార్గమధ్యలో వాహన చోధకునికి ప్రాణాపాయస్ధితి లో ఉన్నాడు. అందులో ఒకరికి వాహనం నడపటం తెలుసు. ఇలాంటి పరిస్ధితిలో నాకు "కోటి విద్యలు కూటి కొరకే" అని నమ్మిన వ్యక్తి డబ్బులు ఇస్తేనే వాహనం నడుపుతాను అంటీ ఆ ప్రాణాపాయస్ధితి లో ఉన్న వ్యక్తి పరిస్ధితి ఏంటి. తను నేర్చుకున్న విద్య ద్వార సంస్కారం బయటపడాలి కాని స్వార్ధం కాదు. ఒకసారి ఆలోచించండి.

మూడనమ్మకం

మూడనమ్మకం ను అందరు నమ్మొద్దు, అవి పనికిరానివి అని చెప్తారు. అది సరియైనదే అయినప్పటికి మనిషి కి గల ఔత్సాహిక గుణం వల్ల అతను అసలు ఎందుకు నమ్మకూడదో వివరించి చెప్తె కాని అందులో ఉన్న నిజం ఎంత, అబద్దం ఎంత గ్రహించలేడు.
అసలు మూడనమ్మకం ఎందుకు వచ్చిందో అది ఎలా ప్రజలకు చేరువ అయిందో తెలుసుకుంటే ఆ మూడనమ్మకం విలువ అర్ధం అవుతుంది.

ఒక ఉధాహరణ: రాత్రి పూట చేతి, కాలి బొక్కలు కీల్లు విరచడం అమ్మ బొక్కలు విరచడం తో సమానం.

ఈ మూడనమ్మకం ను మొదట ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం! పూర్వం మనకు విధ్యుత్ మరియు రోడ్డు రవాణ సౌకర్యాలు ఎంత బాగా ఉన్నాయొ, ఎంత వరకు ఉపయోగకరమైనవో అందరికి తెలుసు. అలాంటి పరిస్ధితిలో ఒక వ్యక్తి రాత్రి పూట చేతి, కాలి బొక్కలు కీల్లు విరచడం వల్ల అతని గాశారం బాగోలేక ఒక కీలు విరిగింది అనుకుందాం! ఇక అతని అవస్ధ శారిరకమైనది అయితే వాల్ల అమ్మ పడే అవస్ధ/బాద మానసికమైనది మరియు శారీరకమైనది. ఆమె తన కొడుకు అవస్ధను తగ్గించడానికి ఆ రాత్రి వైధ్యుని వద్దకు వెల్లి తగిన మందులు కోసం తిరిగి శారీరకంగా చాలా అలసిపోతుంది. మరియు ఇక తను రోజు చేసే పనిలో ఆ విరిగిన వ్యక్తి కి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంటే ఒక రకంగా ఆ వ్యక్తి వాల్ల అమ్మ బొక్కలు పరోక్షంగా విరిచినట్లే కదా! ఒక వేల ఆమె గాశారం బాగోలేక ఆ రాత్రి ఆ హడావుడి లో నిజంగానే ఏదైనా ప్రమాదం జరిగితే! ఊహించండి పై మూడనమ్మకం ఇలాంటి పరిస్ధితిలో నిజమే అని ఎవరైనా నమ్మే అవకాశం ఉంది.
ఇక ఆ నమ్మకం ఎలా ప్రజలకు చేరువ అయిందో చూద్దాం! ఆ నమ్మకంలో అమ్మకు మనం ప్రాధాన్యం ఇచ్చాము. అమ్మ అంటే ఎవరికైనా దైవంతో సమానం. అలా కాకుండా నాన్న అని కాని అన్న అని కాని మరొకరిని కాని ప్రస్తావిస్తే మనం అంతగా ప్రతిస్పందించే వారము కాము అని నా అభిప్రాయం అందువల్లనే ఈ మూడనమ్మకం అంతగా ప్రజల మనసులో నాటుకుపోయింది అని అనుకుంటున్నా!
కానీ నేడు అలాంటి పరిస్దితి రావటం అరుదు. ఎందుకంటే నేడు పెరిగిన సౌకర్యాలు(వైధ్యం, రవాణ మరియు విధ్యుత్) శారీరకమైన శ్రమను చాలా వరకు తగ్గించాయి. నేడు ఒకరకంగా చెప్పుకోవాలి అంటే పగలు=రాత్రి. అందువల్ల నేడు ఆ మూడనమ్మకాన్ని నమ్మడంలో అర్ధం లేదు. అయినప్పటికి రాత్రిపూట ఆ పని చేయకపోవడమే మంచిది కదా!

నిప్పు లేకుండా పొగ రాదు అనేది ఒకప్పటి మాట. కాని నేడు మనం రసాయనాలను ఉపయోగించి పొగనే కాదు ఏకంగా మంటలనే సృష్టించగలం. ఇది నమ్మినవారు. పై నా వివరణ కూడ నమ్మొచ్చు.

ఇలా ప్రతి మూడనమ్మకానికి ఏదొ ఒక కారణం ఉంటుంది. దానిని మనం సవ్యంగా అర్ధం చేసుకుంటే ఏ సమస్య రాదు.

వై.ఎస్.ఆర్ మెగా డి.ఎస్.సి

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన సరిదిద్దుకోలేని తప్పులలో మెగా డి.ఎస్.సి ఒకటి అని నొక్కి చెప్పవచ్చు. ఎందుకంటే
1-> లేని పోస్టులను సృష్టించాడు.
2-> నోటిఫికేషన్ తరువాత 30% ప్రతిపాదన చేసాడు
3-> ఈ మెగా డి.ఎస్.సి లో పోస్టులు ఎక్కువ కాంపేటేషన్ తక్కువ తద్వార క్వాలిటి తక్కువ అయింది.


రాజు తను చేసింది చట్టం తన మాట వేదం అన్న చందాన ఉచిత ప్రతిపాధనలలో భాగంగా ఉచిత డి.ఎస్.సి వేసాడు. ప్రజలను నట్టేట ముంచి తను స్వర్గం చేరాడు. ఈ డి.ఎస్.సి లో నేడు 4.5(మెదక్) మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. మరియు టి.టి.సి చదివిన ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది.

ఆ అభ్యర్థి చాలా అదృష్టవంతుడు. కాని ఒక్కసారి ఆలోచించండి డి.ఎస్.సి లో 200 ప్రశ్నలు 100 మార్కులు. అంటె 9 ప్రశ్నలకు అతను/ఆమె సరియైన సమాదానం ఇచ్చింది. కనీసం 2 అంకెల స్కోరు చేయలేదు. ఎ, బి, సి, డి లలో కనీసం ఒకే ఒక అక్షరం ను ఉపయోగించిన ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి కావచ్చు. ఇలాటి వ్యక్తి ని తెల్లకాగితం లాంటి పసిపిల్లలకు మార్గదర్షిని చేసిన నా రాష్ట్ర ప్రభుత్వానికి, పరిపాలనకు నా జోహారులు.... ఈ డి.ఎస్.సి నోటిఫికేషన్ ను వేసిన వై.ఎస్.ర్ కు జోహారులు....


ఇక నా సందేహములు


డి.ఎస్.సి నోటిఫికేషన్ ను ప్రిపేర్ చేసినవారు ఎవరు?
వారి విద్యార్హతలు ఏమిటి?
వారి అనుభవం ఎంత?
వారి ఉద్ధేశ్యం (స్వలాభం, ఒక వ్యక్తి లాభం, రాష్ట్ర నాషనం, రాష్ట్ర అభివృద్ధి) ఏమిటి?



పైన లాంటి కనీసం 35 మార్కులు కూడ పొందలేని అభ్యర్థులు ఒక జిల్లాలో కనీసం 100 ఉన్నారు. ఒక్కో అభ్యర్థి కింద 50 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుంటే జిల్లాకు 5000 మంది విద్యార్థుల భవిష్యత్తు గంగలో కలపడానికి ప్రభుత్వం మరియు నోటిఫికేషన్ ను ప్రిపేర్ చేసిన పెద్దలు పక్డ్బందీ గా పన్నిన కుట్ర ఇది. ఇలాంటి నోటిఫికేషన్ లు తయారు చేసి ఇలాంటి కనిపించని కుట్రల తో రాష్ట్రాన్ని అమెరికాకు అప్పు ఇచ్చేలా తీర్చిదిద్దుతారట! అది మనం నమ్మాలి.


బి.ఎడ్ లేదా టి.టి.సి చదవడానికి, ప్రవేష పరీక్ష రాయడానికి కింది తరగతులలో కనీసం 45% ఉత్తీర్ణత ఉండాలి అనే నిర్ణయం విశ్వవిద్యాలయాలు నిర్ణయిస్తే ఉపాద్యాయ వృత్తికి నిర్వహించడానికి మన విద్యాశాఖ ఎలాంటి అర్హతను నిర్ణయించలేదు బలే గొప్ప విద్యాశాఖ. ఈ విషయాన్ని పరిగననలోకి తీసుకోని ప్రభుత్వం ఒక గొప్ప ప్రభుత్వం.




ఇక సరిదిద్దుకోలేని తప్పు అని ఎందుకు అన్నాను అంటే, పైన విలువ కట్టలేని మార్కులతో ఉద్యోగాలు సంపాదించిన అభ్యర్థులు కనీసం 30 సంవత్సరాలు సర్వీస్ లో ఉంటారు. ఈ కాలంలో వారు అనుభవం ద్వారానో, దూరవిద్య ను ఆసరా గా చేసుకొని పై పదవులు పొందుతారు. ఇలాంటి అర్ధంలేని, వ్యర్ద (డ్.ఎస్.సి) ప్రతిపాదనలు మరిన్ని చేస్తారు. ఇది ఒక అశుభ సూచకం అని నా అభిప్రాయం.....


ఒక్క చుక్క విషం లీటరు పాలను విషమయం చేస్తే, మరి ఇలాంటి అభ్యర్థుల వల్ల ఎంతమంది విషమయం కాబోతున్నారో కాలమే నిర్ణయిస్తుంది.

డి.ఎస్.సి పై కోర్ట్ స్పందన

ముఖ్యమైన బాలల హక్కులు

1-> జీవించే హక్కు
2-> విద్యా హక్కు
ఈ రెండు ఏదో ఒక కారణాల చేత హరించబడుతున్నాయి. పేదరికం, ఆడపిల్ల, ఇంకా ఇతర అనేక కారణాల చేత జేవించే హక్కు ను కాలరాస్తున్నాము. ఇక విద్యాహక్కు ను ఈ క్రింది విధంగా హరించివేస్తున్నాము.

డి.ఎస్.సి పై హైకోర్ట్ దే తుదినిర్ణయం అని సుప్రీంకోర్ట్ తప్పించుకుంది. ఇక హైకోర్ట్ ప్రభుత్వానిదే తుదినిర్ణయం అని చేతులు దులుపుకుంది. ఇక ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా నియమాకాలు చేపట్టింది. ఈ నియమాకాల ద్వారా ఏమి సాధిస్తున్నాము, ఏమి కోల్పోతున్నాము అని మాత్రము గమనించడము లేదు.

కోర్ట్ అడగని విషయాలు
1-> 50000 పోస్టులు అని మెగా డి.ఎస్.సి అని లిఖిత పూర్వక ఆధారాలను మాత్రమే పరిశీలించింది. మరి వాస్తవ ఆధారములు సమర్పించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించలేకపోయింది.
2-> 70:30 పోస్టులు అనే GO ప్రభుత్వం జారీ చేసినప్పుడు. పోస్టుల సంఖ్య మరియు దరఖాస్తుల సంఖ్య అందులో బి.ఎడ్ మరియు టి.టి.సి దరఖాస్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అని పరీశీలించలేకపోయింది మరియు ప్రశ్నించలేకపోయింది.
3-> ఏ ప్రాతిపధికన ఈ పోస్టుల విభజన జరిగిందో తెలుసుకోలేకపోయింది.
4-> ప్రత్యామ్నాయ మార్గాలను సూచించమని ఆదేశించలేకపోయింది.




పై విషయాల పరిగణన లేకపోవడం వల్ల 30 శాతం పోస్టులలో పోటి లేకుండా పోయింది. తద్వార నాణ్యమైన ఉపాద్యాయులను వెలికెతీయడంలో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పవచ్ఛు. ఇక కోర్ట్ విషయం కు వస్తే నాణ్యమైన ఉపాద్యాయులను అందించలేని నోటిఫికేషన్ విడుదలను, నియమాకాలను మరియు GO లను ఆపడంలో విఫలమై బాలల విద్యా హక్కును కాలరాసి వారికి తీరని అన్యాయాన్ని చేసింది. ఈ రకం కనిపించని అన్యాయాని అడ్డుకోలేని కోర్టులు ఉన్నా! లేకున్నా ఒకటే........


ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి గల వ్యక్తులమైన నాయకులము, అధికారులము, ప్రజలము మనమే ఓనమాలు అంటే ఏమిటో తెలియని పసివారికి ఈ రకంగా అన్యాయం చేస్తున్నాము. ఎవరు అడగగలరు అనే ధీమాచేతనే కదా!


ఇక నుండైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాస్తవికంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి, కోర్టుకు నామనవి. ఇక సులభరీతి లో ఉద్యోగం సంపాదించిన ఉపాద్యాయులు తమ తెలివితేటలను పెంపొందించుకుని విద్యార్థులకు తగు న్యాయం చేయగలరని మనవి.

ఇందిరమ్మ జిల్లాగా మెదక్ జిల్లా

గౌరవనీయులైన ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి కొనిజేటి.రోషయ్య గారికి వందనములు. సంగారెడ్డి లో 125 వార్షికోత్సవ సభలో మెదక్ జిల్లా పేరును ఇందిరమ్మ జిల్లా గా ప్రకటించారు. అని తెలుసుకున్న నేను మెదట సంతోషించాను తరువాత కొంత బాద పడ్డాను. ఎందుకు బాద పడ్డానో వివరిస్తాను.
ఇక రోషయ్య గారికి ఒక ప్రశ్న. మీ దృష్టిలో ఇందిరాగాంధి గారు, రాజీవ్ గాంధి గారు మరియు సోనియాగాంధి గారు మాత్రమే నాయకులు అని భావిస్తున్నట్లు ఉన్నారు?. తొందరగా నే ఆ స్పృహనుండి బయటికి వస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీ పథకానికి వీరి పేర్లే పెడుతున్నారు. ఉదాహరణకు రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ మిషన్, రాజీవ్ గాంధి లలితకళాతోరణం, ఇందిర గృహకల్ప, ఇందిర క్రాంతి పథకం ఇప్పుడు ఇందిరమ్మ జిల్లా గా మెదక్ జిల్లాకు నామకరణం చేయబోతున్నారు.
ఇందిరమ్మ జిల్లాగా పేరు మార్చడంలో ఉద్ధేశ్యం -> ఇందిరగాంధి తన హయాంలో మెదక్ జిల్లానుండి పోటి చేసి అత్యధిక మెజారిటి తో గెలుపొంది మనదేశ ప్రధాని అయ్యారు తరువాత మెదక్ పరిసరాలను పరిశ్రమలతో కలకలాడేటట్లు చేసింది. మరియు ఆమెను ఆమె ఘనతను, సేవలను చిరకాలం గుర్తుండి పోయెలా చెయ్యాలి.
సరే ఉద్ధేశ్యం మంచిదే కాని పైన పేర్కొన్న నాయకులు మాత్రమే నాయకులు అని అనుకుంటే పొరపాటు. ఇలా ప్రతీ పథకానికి వీరి పేర్లే ఎంచుకునే బదులు మన ఆంధ్రప్రదేశ్ నాయకులు చాలా మందే ఉన్నారని గమనించండి. పింగలి వెంకయ్య గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నీలం సంజీవ రెడ్డి గారు, పి.వి.నర్సింహరావు గారు, మిర్ మహబూబ్ ఆలి గారు, మెదలగు వారు చాలా మంది నాయకులే ఉన్నారు. మరి వీరి పేర్లు ఎందుకు ఎంచుకోవడం లేదు. వీరు నాయకులు కారా లేక వీరికి ఆ అర్హత లేదా! అని నా అనుమానం.
అంతో ఇంతో తెలిసిన నాకే వీరిలో కొందరు పేర్లు ఎప్పుడు వెనలేదు, వినేలాంటి పరిస్థితులు నాకు ఎదురైన సందర్భాలు చాలా తక్కువ. ఇక భవిష్యత్తులో పుట్టబోయె నా పిల్లలకు ఎలా తెలుస్తుందో, ఏమని వెవరించాలో అసలు వాళ్ళు వీరి పేర్లు వెనే అవకాశం వస్తుందో లేదో.
ఇందిరగాంధి గారు తన హయాంలో హైదరాబాదు కు సరిహద్దుగా ఉన్న మెదక్ జిల్లా పరిసరాలను పరిశ్రమలతో కలకలాడేటట్లు చేసింది. కాని ప్రచార అస్త్రం మాత్రము అది కాదు అని నా అభిప్రాయం. మెదక్ జిల్లాను పరిశ్రమల అడ్డా గా మార్చుతా అని చెప్పి రవాణా, పట్టణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాదు సరిహద్దు ను అభివృద్ధి చేసింది. రాజకీయ ఎత్తుగడ లతో క్షుణ్ణంగా అద్యయనం చేసి మెదక్ జిల్లాను తను పోటి చేయడానికి అనువైన ప్రదేషం గా ఎంచుకొని తన మాటను ఈ ఫిధంగా నిలుపుకుంది.
పైన పేర్కొన్న నాయకులను కించపరచాలనో తక్కువ చేసి చూపించాలి అనే తాపత్రయం నాకు లేదు. నా అభిప్రాయం ఎమిటంటే మన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి వారినికూడా భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిస్తితులను మనం కల్పించాలి.




ఇంకో విషయం ఏదైనా ప్రకటించే ముందు మాలాంటి సగటు వ్యక్తుల అభిప్రాయం ను పరిగణనలోకి తీసుకోవాలని నా మనవి.

ప్రేమ+ఇస్తున్నాను

తెలుగు వ్యాకరణం ప్రకారం మనం ఏదైన ఇచ్చేటప్పుడు "ఇస్తున్నాను" అనే పదం వాడుతాము. అది కూడ చాలా స్పష్టమైన అర్థాన్ని ఇచ్చే వాఖ్యాలలో వాడుతాము
ఉధాహరణకు

నేను నీకు పిల్లను ఇస్తున్నాను
నేను నీకు ఆస్తిపాస్తులు ఇస్తున్నాను
నేను నీకు అప్పుఇస్తున్నాను
నేను నీకు బహుమతి ఇస్తున్నాను అంటాము


ఇక్కడ ఇచ్చేవారికి ఏమిటి, ఎందుకు, ఎవరికి, ఎలా,ఎంత ఇస్తున్నారో తెలుసు మరియు తీసుకునేవారికి ఏమిటి, ఎందుకు, ఎవరి నుండి, ఎలా,ఎంత తీసుకుంటున్నాడో తెలుసు

కాని

ప్రేమ విషయంలో

అందరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ( ప్రేమ+ఇస్తున్నాను ) అంటారు. ఇక్కడ వాఖ్యనిర్మాణం సరిగాలేదు మరియు స్పష్టంగా కూడ లేదు. ఎందుకంటే ఇచ్చేవారికి పైవన్ని తెలుసు కాని తీసుకునేవారికి ఎందుకు మరియు ఎంత ఇస్తున్నారో తెలియకపోవచ్చు, అవసరం లేదు అని వ్యతిరేఖించవచ్చు. ఎందుకు తీసుకోవడం లేదు అని నిలదీసినా ఎదుటివారినుండి సరియైన సమాదానం రాకపోవచ్చు.

తెలుగు వ్యాకరణం తెలిసినవారు పైవాఖ్యలోని అర్థాన్ని తొందరగా గ్రహించగలరు మరియు చంపడం, చావడం, కుంగికృషించడం లాంటివి చర్యలకు దూరంగా వుంటారు.

ఇక నామటుకు ఒకసారి అలాచెప్పి బాదపడ్డాను వ్యాకరణం తెలిసి బాదకు దూరం అయ్యాను. ఇకపై ఎవరికైనా ప్రేమను ఇచ్చేటప్పుడు నేను నీకు ప్రేమిస్తున్నాను అని చెప్తాను. ఒక వేల తను తీసుకున్నా, తీసుకోకపోయినా నాకు కలిగేది ఆనందమే ఎందుకంటే రెండు తన చర్యలే కనుక తను చేసే ఏ చర్య అయినా తనకు ఆనందాన్నిస్తుంది అందువల్ల నాకు ఆనందమే మిగులుతంది.

ఉపవాసం

ఉపవాసం అంటే ఒక పూట మాత్రమే శాఖాహారం + అన్నం తిని తరువాత వీలుంటే పండ్లు లేదా శాఖాహార సంబంద పదార్థాలు తినడం అని తెలుసు.

మరి ఒక పూట మాంసాహారం + అన్నం తిని తరువాత వీలుంటే మాంసాహార సంబంద పదార్థాలు తినడం లాంటి క్రియ ను ఏమంటారు?

ఉపవాస దినచర్య ఇలా ఉంటే!!!!!!!!!

సోమవారం---------------> శాఖాహారం మాత్రమే

మంగలవారం------------->నా ఇష్టం
బుదవారం----------------> మాంసాహార ఉపవాసం
గురువారం---------------->పూర్తిగా ఉపవాసం
శుక్రవారం-----------------> నా ఇష్టం
శనివారం------------------> శాఖాహార ఉపవాసం
ఆదివారం-----------------> మాంసాహారం మాత్రమే

ఎలా ఉంటుంది. మందుబాబులకు కొంత వరకు కంట్రోల్ లో ఉంటారు అనుకుంటాను.

SSC Reslult

SSC Reslut వచింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఇక మార్కుల విషయంకు వస్తే ప్రతీ సంవత్సరం మార్కుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అది మంచికో లేక చెడుకో అర్థంచేసుకోండి.

1990-1995 లలో 500 మార్కులు గగనం అనేవారు. ఆ విద్యార్థులు తల ఎత్తుకుని తిరిగేవారు. ఆ తరువాత అంటే 1996-2000 వరకు మద్యకాలంలో వీరి సంఖ్య పెరిగింది మరియు చివరి అంకంలో మార్కుల విలువ కూడ పెరిగింది. సుమారుగా 550. ఆతరువాత ప్రతీ సంవత్సరం పెరుగుతూ నేడు 595 మార్కులకు చేరుకుంది.

నాది 2001 . మా పాఠశాలలో నాతో కలిపి మొత్తం 10 మందికి 500 (545-501) ఆపై మార్కులు వచ్చాయి. అందుకు గాను మా నియోజిక వర్గ M.L.A గారు Silver Medal తో సత్కరించారు. ఆనాడు మేము చాలా గర్వపడ్డాము. మరి ఇప్పుడు 550 మార్కులు వచ్చిన విద్యార్థికి ఆ గౌరవం పొందుతున్నాడా లేడా ఆలోచించండి.

ఇక మార్కుల విషయంకు వస్తే...! ఆంగ్లము, హింది, తెలుగు బాషసంబంధ విషయాలు. అందులో ఏమేరకు ప్రావీణ్యం ఉంటే 100 కు 99 or 98 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా నయం ఇప్పుడు 99 or 98 వేస్తున్నారు. ఇకముందు అందులో కూడా 100 మార్కులు చూస్తాము కావొచ్చు. ఇక గణీతం, ఇది తెలిస్తీ దీని అంత సులభమైన సబ్జెక్టు ఇంకోకటి ఉండదు. ఇది ఖశ్చితమైన ఫలిత సంబంధమైనది కావున 100 రావొచ్చు అనుకుందాం! మరి సామాన్య, సాంఘీక శాస్త్రాలు అలాంటివి కావు కదా! మరి వాటిలో కూడ 100 మార్కులు ఎలా వేస్తున్నారు.

నా ఉద్దేశ్యం ప్రకారం దయచేసి ప్రతిభను ఇలా మార్కులను అధికంగా చూపించి చులకన చేయకండి. అలా వారిని ప్రోత్సహిస్తున్నాము అనే భావన ఏమేరకు సరియైనదో విష్లేషించుకోండి.

Father's Day(Jun 3rd Sunday)

తమ తమ కొడుకులకు తప్పులు చేస్తున్నారని బాదపడేకంటే ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశాలను కల్పించండి. మీరు ఉన్నారు అనే బరోసా కలిగించండి. తప్పు అని తెలిసుకున్న ఏ వ్యక్తి అయినా మల్లి చేయడానికి సిద్దంగా ఉండడు. కాని ఒకటి మాత్రము చెప్పగలను, అసలు తప్పు-ఒప్పు అనే పదాలను నిర్వచించి చెప్పెకంటే ఒకసారి అనుభవం అయితేనే బాగుంటుంది.

పుణ్య భూమి నాదేశం

పుణ్య భూమి నాదేశం సినిమా లో హీరో మోహన్ బాబు చివరి డైలాగు " గాంధీజి గుజరాతి కోమటి, నన్నయ బ్రాహ్మణ కులమున పుట్టెను - అని ఎవడు నూరి పోయమన్నాడు "అంటాడు
"ముంబాయి లో 4 చోట్ల పేలుల్లు-కసబ్ పుట్టిన రోజు" అనే వాఖ్యాని కూడా జత చేస్తే ఎలా ఉంటదో!!!!!!!

ఒక సారి ఆలోచించండి. ఒక సామాన్య బాదితుడు లేక పౌరుడి ని "ఈ బాంబు పేలుల్లు కసబ్ పుట్టిన రోజు కావడం లో మీ స్పందన ఏమిటి? అని ప్రశ్నిస్తే అతడు ఏమి సమాదానం ఇవ్వగలడు. పైగా జీవితాంతం గాంధి జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం లా గుర్తు పెట్టుకుంటాడు.

ఇక పోటి పరీక్షలు రాసే అభ్యర్థి ఈ సంఘటనను కరంట్ అఫైర్స్ లో ఇస్తారు కావొచ్చు అని ఒక కోడ్ తయారు చేసుకుంటాడు.
చాచా నెహ్రు పుట్టిన రోజును ఆయనకు పిల్లలంటే ఇష్టం కనుక బాలల దినోత్సవం అన్నారు.
కసబ్ పుట్టిన రోజును ఒక తీవ్రవాది కనుక బాంబు పేలుల్లు జరిగాయి అని గుర్తు పెట్టుకోవడానికి పనికివస్తుంది.

ఒసామా బిన్ లాడెన్ కు కూడ ఇంత ప్రచారం జరగలేదు. అది తొందరగానే మరచిపోయి ఉంటారు.

నా ఉద్దేశ్యం :- నిన్నటి పేలుల్లకు కసబ్ పుట్టినరోజు ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ గా తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రమాదకర ప్రచారం లబించకుండా ఉంటే బాగుంటుంది.

నా యీ పోస్ట్ కూడా నెగెటివ్ ప్రచారమే అవుతుంది. కాని, కసబ్ ను మనం ఇంకా చంపకుండా, ఉరితీయకుండా, తగిన శిక్ష విధించకుండా ఇంకా ఎందుకు జైలు గోడల మధ్య ఉంచి పెంచి పోషిస్తున్నాము. ఏవైనా కొత్త ఆధారాలు దొరుకవచ్చు, ఇన్వెస్టిగేషన్ లో పురోగతి లభించవచ్చు ముందుముందు ఇలాంటి తీవ్రవాద చర్యలను నివారించవచ్చు అనే ఒక ఆశ. మరి నివారించగలిగామా? నిన్నటి పేలుల్ల ను ఆపగలిగామా?
పై ప్రశ్నలకు "లేదు" అనేది సమాదానం అయితే, కసబ్ ను రక్షించడానికి మనం కర్చుచేస్తుంది వృధా అయినట్లే లెక్క, మరియు కసబ్ ను ఇంకా శిక్షించకుండా ఉండటం కూడా సరియైన పద్దతి కాదు.

కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను, సైకాలజి ప్రకారం "బహుమతి-దండన" లలో బహుమతి వల్ల కీడు కంటే మేలు ఎక్కువ జరుగుతుంది అని భావింఛి పాఠశాల లో బెత్తెంతో దండించడాన్ని నిశేధించాము. అలాగే దేశ పురోగతికి నాయకులు బహుమతులు అయితే కసబ్ లాంటి వారు దండన కోవలోకి వస్తారు. అందువల్ల ఇలాంటి వారిని ఏమి చేయాలి - పుట్టినరోజు ప్రచారాలను ఎలా ఆపాలో ఆలోచించాలి.

వారము

ఒక వారము కు 7 రోజులు........ కాని ప్రతీ రోజు "వారము" తో పిలువబడుతుంది.

తిండిగింజలు

భూమి మీద సుమారు 700 కోట్ల జనాభ ఉందని లెక్కగట్టిన మనిషి ఒక మనిషి జీవితకాలంలో తినే తిండిగింజల సంఖ్యను లెక్కగట్టలేకపోయాడు................

కన్నులు

మనం నిద్రపోవాలంటే ఖశ్చితంగా మన కన్నులు మూసుకొని ఉండాలి.............

అబద్దము

అబద్దాలు ఆడితె ఆడపిల్లలు పుడతారు (ఓ బామ్మ మాట)


అబద్దాలు ఆడితె ఆడపిల్లలు పడతారు ( నేటి యువకుని బాట)

ఆనందం నం 1

బండి మీద దూర ప్రయాణం చేస్తున్నపుడు చిన్నగా వర్షం, చుట్టూ పచ్చని పొలాలు, దూరంగా అందమైన కొండల సమూహం, 50 నుండి 60 కి.మి ల వేగంతో ఊఊఊఊఊఊ అని అరుస్తూ వెలుతుంటే............... నా సామి రంగా.......... ఆ సమయంలో గరం గరం చాయి తాగుతూ ఒక సిగరెట్ వెలిగించి పక్కనే ఉన్న స్నేహితుడుతో పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతూ వెలుతుంటే................

మరియు నాకు నచ్చిన అమ్మాయి నావెనకాల కూర్చుని హాయిగా ప్రయాణం సాగిపోతుంటే కలిగే ఆనందం మాటలలో వర్ణించలేము........

ఆనందం నం 2

4వ లేదా 5వ అంతస్తు బాల్కని లో ఉదయం 9గం సమయంలో ప్రెష్ గా స్నానం అయిన తరువాత, ఎడమ చేతి తో చాయి కప్పు పట్టుకుని కుడిచేతి ని ప్యాంట్ జేబులో పెట్టుకుని అటూఇటు తిరుగుతూ సూర్యుని నుండి వచ్చె వెచ్చని కిరణాలు దేహానికి తాకుతుండగా పక్క బవనంలో ఉన్న అమ్మాయిలకు స్టైల్ గా సైట్ కొడుతుంటే......................

ఆనందం నం 3

ఎండాకాలం లో బాగా తిరిగి చాలా దాహంతో ఇంటికి వచ్చాక ఒక గ్లాసు మంచి నీరు మూతిపెట్టి గడ గడా తాగి విశ్రాంతి కోసం సోపా లో ప్యాన్ లేదా కూలర్ ముందు కూర్చుంటే................. వాహ్! స్వర్గం లో కూడ దొరకని ఆనందం........

ఆనందం నం 4

అలవాటు లేని తిండి తిని తిని ఒక్కసారి మన ఇంటికాడ అమ్మ చేసిన కందిపప్పు చారు తో జుర్రుకుంటూ తింటుంటే........ స్వామి రంగా స్వర్గం కనపడుతుంది...........

ఆనందం నం 5

ఒక ఎకరా స్థలం లో ముందు ఒక పెద్ద ద్వారము. మద్యలో ఒక చిన్న కట్టెలతొ కట్టిన ఇల్లు. చుట్టూ పచ్చని అందమైన పూల తోట. చాయి తాగుతూ పిట్టగోడ మీద కూర్చుని పక్కనే ఉన్న ప్రియురాలి కి దూరంగా ఉన్న కొండలు, చెరువు చూపిస్తూ ఆ సమయంలో చిన్న సరసం........................... అలాంటి అందమైన ఆనందం ఎవరూ కోల్పొకూడదు.

ఆనందం నం 6

ఎవరైనా సరే పూర్వం తను చేసిన పని ని తన ముందు వేరె వారు పొగుడుతున్నపుడు అందులో తన ప్రావీణ్యాన్ని, నైపుణ్యాన్ని, సామర్ద్యాన్ని గుర్తుచేస్తె వ్యక్తి పొందే ఆనందం ఇంకెవరు పొందలేరు మరియు ఇంకా హుషారు తో తను చేస్తున్న పని పూర్తి చేస్తాడు

పేక ముక్కల భారతం

పేకాట పాపారావు సినిమా లో రాజేంద్రప్రసాద్ గారు పేకాట గురించి, పేక ముక్కల గురించి చెప్పే కొన్ని సిల్లి నిజాలు........


సంవత్సరానికి వారాలు 52 పేక కట్టలో ముక్కలు 52.
1 or A - దేవుడు ఒక్కడే
2 - ఆత్మ-పరమాత్మ
3 - త్రిమూర్తులు
4 - నలుదిక్కులు
5 - పంచభూతములు
6 - ఆరు ఋతువులు
7 - సప్త సముద్రాలు
8 - అష్ట దిక్ఫాలకులు
9 - నవగ్రహాలు
10 - దశావతారములు
J - JESUS
Q - QURON
K - Lord KRISHNA
by/ (పేకాట పాపారావు)

కాదనొద్దు

కాదనొద్దు please
.
.
.
please కాదనొద్దు

which one is good to use.

chali kalam

వనికించే వాతావరణం
ఉధయించే భానుడందం
అడ్డుతగిలే మంచుమందం

మొత్తంగా ఒక సుందర దృష్యం
ఇచ్చును నీకు అమితానందం
good morning

chinni kavitha

నిను చూడగ శిలనైన!
మాటాడగ మునినైన!
పొగడగ కవినైన!
మొత్తంగా నీ దాసుడినైన!

kurivippina nemali andam....(yshali) remix.

నీతో నా Lifu (life) అందము
నువు లేని నా జన్మ వ్యర్ధము
నిను ఏల మరువజాలను
.
.
.
నా ఙ్ఞాపకం, వ్యాపకం, ఆశ, శ్వాస అన్ని నువ్వే!!!!!!!!

నా కవిత

నే చూసిన ఆ అందం నీది
మైమరచిన ఈ క్షణం నాది


నే పలికిన ఆ పేరు నీది
పులకరించిన ఈ మేను నాది


నే పొగిడిన ఆ సౌందర్యం నీది
రాసిన ఈ కవిత నాది

1 side HELL

భ్రహ్మ రాసేది నుదిటివ్రాత
అమ్మ పాడేది లాలిపాట
నేను చెప్పేది ప్రేమగాధ
మొత్తంగా ఇది నా One side వ్యధ

be aware of 1 side LOVE

అమ్మ చేతి బొమ్మ
నాన్న చేతిలో పెరిగింది
నలుగురితో కలిసింది
అమ్మాయి చుట్టూ తిరిగింది
చివరికి మిగిలింది




అమ్మకు కడుపుకోత
నాన్నకు గుండెకోత
స్నేహానికి తీరని వ్యధ
గాలిలో కలియును నీ కధ!!!


so be aware of ONE SIDE LOVE

అంకెలు - ఇష్తాలు

0 - భూమి గుండ్రంగా ఉంటుంది 0 లాగె, నేను నా లవ్ కలిసింది భూమి మీదె కదా!
1 - తొలిసారి(1) చూడగానే మతిపోయింది.
2 - తను నేను ( 2 ) ఇద్దరమే ఈ ప్రపంచంలో
3 - 1 కావాలంటే 3 వేయాల్సిందే!
4 - నాలుగు వేదాలు మరియు నలుగురు మెచ్చాలి కదా!
5 - పంచభూతములు సాక్ష్యంగా ఉండాలి మరియు it looks like "S".
6 - ఆరు గజాల చీరలో పదహారణాల తెలుగమ్మాయి.
7 - నా ఇష్టమైన నంబర్ ‍మరియు 7 జన్మలు, 7 అడుగులు అబ్బో..... చాలా నే ఉంది దీని కథ.
8 - అష్ట లక్ష్మిలు ( అన్ని తనే నాకు).
9 - మమ్మ్లల్ని నడిపించేది నవ గ్రహాలే కదా!

Bangaram: It is the time to comment on RESERVATION

Bangaram: It is the time to comment on RESERVATION