ఎందరో మహానుభావులు అందరికి వందనములు
మహానుభావులు అందరు తమ జీవితకాలంలో తమ లక్ష్య సాధన కొరకు ఎంతో కష్టపడి, బాదపడి, శ్రమటోడ్చి, అహర్నిషలు తమ తమ లక్ష్యంను సాధించుకోవడం లో సఫలీకృతులైనారు. వారి ఉధ్దేశ్యం లో వారి వారసులకు తమ లక్ష్యం వల్ల మేలు జరుగుతుంది అని నమ్మేవారు. అలా వారి జీవితం మనకు ఆదర్శం అయ్యాయి.
అలాంటి వారిని మనం గౌరవసూచకంగా వారి ఆత్మకథలను, ఆశయాలను, లక్ష్యాలను పుస్తకరూపంలో ముద్రించి చదువుకోవడమే కాక విగ్రహలను ప్రతిష్టించుకున్నాము.
కాని నాకు ఒక సందేహము.
వారు జీవించి ఉన్నపుడు కష్టపడ్డారు అలాగే చనిపోయిన తరువాత కూడ విగ్రహాలు గా ఎండలో ఎండి, వానలో తడిచి, చలికి గడ్డకట్టి ఎవరైనా నచ్చక రాల్లతో కొట్టినా పడుకుంటూ అలా ఉండిపోతున్నారు. మమ్మల్ని ఆదర్శముగా తీసుకోండి అని చనిపోయినా తరువాత కూడ విగ్రహాల రూపంలో మనకు ఆదర్శము గా నిలుస్తున్నారు అది ఎంతమంది గ్రహిస్తున్నారు...........
నేను కూడ ఒక విగ్రహం తయారు చేసుకుని నా పై ఒక గమనిక " నా లా ఉండకు" అని రాయించుకుంటా..........ఎందుకంటే నేను ఇప్పటి వరకు సాధించింది ఏమిలేదు.......
No comments:
Post a Comment