చవితి పండగ సందర్భంగా మనం అందరం ప్రతీ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తి తో పూజలు నిర్వహించి ఆ తరువాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము.
ఈ పండుగకు ముందు 2 నెలల నుండి రైతులు చెరువులలో కుంటలలో పూడికతీత పనులు నిర్వహిస్తారు. తద్వార తరువాత పడే వర్షపు నీటిని వృధా కాకుండా నివారిస్తారు. అయితే ఈ సమయంలో వర్షపు నీటితో కలకలాడుతూ ఉన్నపుడు పూడిక నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని ప్రజలు పూడికతీతలో చూపిన శ్రధ్ద పూడిక పూడ్చడంలో చూపడంలో లేదు. అందుకే ప్రతీ ఇంటి నుండి కొంత మన్ను లేదా మట్టిని విగ్రహరూపంలో తయారు చేసుకుని ఆ మట్టిముద్దను చెరువులో నిమజ్జనం చేయాలని ఆచారం చేసారు. ఆ ఆచారం వల్ల పూడిక తీసిన చెరువులు పూడిక నిండుతుంది.
కాని నేడు ఆ వినాయక విగ్రహాలు మట్టితో కాకుండా ప్లాస్టర్ అఫ్ పారిస్ తో రంగురంగుల కెమికల్స్ ఉపయోగించి తయారుచేస్తున్నారు. వాటి వల్ల చెరువులు పూడిక నిండకపోగా నీటి కలుషితం జరుగుతుంది. దయచేసి గమనించండి.............
..........నిర్ణయం మీదే పర్యావరణ పరిరక్షణ మీదే.......
No comments:
Post a Comment