ఉధాహరణకు
నేను నీకు పిల్లను ఇస్తున్నాను
నేను నీకు ఆస్తిపాస్తులు ఇస్తున్నాను
నేను నీకు అప్పుఇస్తున్నాను
నేను నీకు బహుమతి ఇస్తున్నాను అంటాము
ఇక్కడ ఇచ్చేవారికి ఏమిటి, ఎందుకు, ఎవరికి, ఎలా,ఎంత ఇస్తున్నారో తెలుసు మరియు తీసుకునేవారికి ఏమిటి, ఎందుకు, ఎవరి నుండి, ఎలా,ఎంత తీసుకుంటున్నాడో తెలుసు
కాని
ప్రేమ విషయంలో
అందరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ( ప్రేమ+ఇస్తున్నాను ) అంటారు. ఇక్కడ వాఖ్యనిర్మాణం సరిగాలేదు మరియు స్పష్టంగా కూడ లేదు. ఎందుకంటే ఇచ్చేవారికి పైవన్ని తెలుసు కాని తీసుకునేవారికి ఎందుకు మరియు ఎంత ఇస్తున్నారో తెలియకపోవచ్చు, అవసరం లేదు అని వ్యతిరేఖించవచ్చు. ఎందుకు తీసుకోవడం లేదు అని నిలదీసినా ఎదుటివారినుండి సరియైన సమాదానం రాకపోవచ్చు.
తెలుగు వ్యాకరణం తెలిసినవారు పైవాఖ్యలోని అర్థాన్ని తొందరగా గ్రహించగలరు మరియు చంపడం, చావడం, కుంగికృషించడం లాంటివి చర్యలకు దూరంగా వుంటారు.
ఇక నామటుకు ఒకసారి అలాచెప్పి బాదపడ్డాను వ్యాకరణం తెలిసి బాదకు దూరం అయ్యాను. ఇకపై ఎవరికైనా ప్రేమను ఇచ్చేటప్పుడు నేను నీకు ప్రేమిస్తున్నాను అని చెప్తాను. ఒక వేల తను తీసుకున్నా, తీసుకోకపోయినా నాకు కలిగేది ఆనందమే ఎందుకంటే రెండు తన చర్యలే కనుక తను చేసే ఏ చర్య అయినా తనకు ఆనందాన్నిస్తుంది అందువల్ల నాకు ఆనందమే మిగులుతంది.
No comments:
Post a Comment